- ధీమాను వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే,బీజేపీ నేత డాక్టర్. గువ్వల బాలరాజు
నాగర్ కర్నూల్, నవంబర్ 18(ఎస్ బి టూ డే న్యూస్):నాగర్ కర్నూల్ జిల్లా
అచ్చంపేట టౌన్‌లో మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గువ్వల బాలరాజు స్వగృహం లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గువ్వల బాలరాజు మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అచ్చంపేటతో పాటు మొత్తం తెలంగాణలో బీజేపీ విజయం ఖాయం అన్న ధీమాను వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గువ్వల
బాలరాజు మాట్లాడుతూ, ఇటీవల బీహార్‌లో బీజేపీ మరోసారి భారీ విజయాన్ని సాధించిందని, దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంపెంచుకుంటున్నారని పేర్కొన్నారు. యావత్భారత దేశం సమర్థ వంత మైన నాయకుడు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వైపు దేశ ప్రజలంతా ఆకర్షితు లయి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వం దేశం లో పేద ప్రజలకు అవసర మైన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ భారత్ ను శత్రు దేశాలకు ధీటుగా శక్తి వంత మైన ప్రభుత్వాన్ని అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న కేంద్రం లో విజయ వంతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ప్రజా హిత పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోక ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు.
గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయివరకు అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని బాలరాజు అన్నారు. అచ్చంపేటలో బీజేపీ బలం రోజురోజుకు పెరుగుతోందని, ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక నుంచి స్థానిక సంస్థల ఎన్నికల లో పార్టీని అందరూ ఐక్యత తో కలిసి విజయం వైపు నడిపించే దిశ ప్రతీ కార్య కర్త పై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, గిరిజన మోర్చా జాతీయ మంగ్యా నాయక్ , సీనియర్ నాయకులు మండి కారి.బాలాజీ,రాములు,రామచంద్రయ్య,న్యాయ వాదులు, అంజనే యిలు,చందు లాల్ చౌహాన్,రేణయ్య శంకర్ మాదిగ, పట్టణ కమిటీ అద్యక్షులు శ్రీని వాస్ గౌడ్,నాయకులు పట్టణ నాయకులు, కార్య కర్తలు భారీగా పాల్గొన్నారు.
