- టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
- ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన తెలిపి వినతి పత్రం అందజేత
పినపాక మండల వ్యాప్తంగా 23 గ్రామపంచాయతీలలో గుంతలరోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని పినపాక బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బుధవారం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపుమేరకు మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. అనంతరం ఎంపీడీవో సంకీర్త్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గాంధీ, భవాని శంకర్, తదితరులు పాల్గొన్నారు.
