సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదం

సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదం

అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ వివరాలు త్వరలో విడుదల

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 

మక్కా నుంచి మదీనా వైపు ప్రయాణిస్తున్న భారతీయ యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మంటలు అంటుకొని దుర్ఘటన చోటుచేసుకుంది. 

*ఈ ప్రమాదంలో మొత్తం 42 మంది భారతీయులు సజీవదహనమైనట్లు ప్రాథమిక సమాచారం వెలువడింది*.

మృతులలో హైదరాబాద్‌కు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నట్టు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

 మరణించిన వారిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు ప్రారంభ దర్యాప్తులో తెలుస్తోంది. 

ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.