పాల్వంచలో కలకలం రేపుతున్న ఇద్దరు విద్యార్ధినుల మిస్సింగ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :మహాత్మా గాంధీ జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల రెసిడ్సియల్ వసతి గృహం నుండి నిన్న ఆదివారం రాత్రి ఏడవ తరగతి చదువుతున్న ఇద్దరు ఆడ పిల్లలు మిస్ అయిన ఘటన పాతపాల్వంచ జ్యోతినగర్లో చోటుచేసుకుంది.కొద్దిరోజుల క్రితం నవభారత్ ఆశ్రమ వసతిగృహంలో విద్యార్థిని ఉరివేసుకున్న ఘటన మరువక ముందే నేడు ఇద్దరు పిల్లలు మిస్సింగ్ జరుగడం కలకలం రేపుతోంది.ఆర్సీవో రాంబాబును ఫోన్లో వివరణ కోరగా ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రిన్సిపాల్ లీవ్ లో ఉందని నైట్ కేర్ టేకర్ చూసుకుంటుందని సీసీ కెమెరాలు ఉన్నా పనిచేయడం లేదని తెలిపారు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.