మండలం శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి హాజీపూర్ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో లారీ కారు ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న పలువురికి తెలిపిన గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి అచ్చంపేట ప్రాంతానికి చెందిన రమేష్ కుటుంబ సభ్యులు కారులో వెళ్తుండగా హాజీపూర్ వైపు నుంచి డిండి వైపు వెళ్తున్న లారీ ఢీకొనడం వలన కారు పైకప్పు పూర్తిగా ఊడిపోయి లారీ ముందు భాగంలో ఇరుక్కుపోయింది. ఒక మహిళకు కాళ్లు విరగ్గా మరో మహిళకు బలమైన గాయాలు అయినట్లు తెలుస్తుంది. క్షతగాత్రులు అచ్చంపేట ప్రాంతానికి చెందినవారే అని స్థానికులు తెలుపుతున్నారు. విషయం తెలిసిన అచ్చంపేట పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుంటున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట
