జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గామలపాటి లక్ష్మయ్య జ్ఞాపకార్థ క్రీడా పోటీలు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గామలపాటి లక్ష్మయ్య  జ్ఞాపకార్థ క్రీడా పోటీలు 

గుండాల మండలం ఆగస్టు 13 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:

 గుండాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటెండర్ గా1985 విధులు చేరి  2015 సంవత్సరంలో పదవి విరమణ పొంది అనంతరం అనారోగ్యంతో 2024లో మరణించారు. గామలపాటి లక్ష్మయ్య జ్ఞాపకార్థంగా ఆగస్టు 15 పురస్కరించుకొని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  విద్యార్థులకు క్రీడ పోటీలను కుటుంబ సభ్యులు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన గుండాల  సర్పంచ్  కోరం సీతారాములు క్రీడ పోటీలను ప్రారంభించారు. అనంతరం కోరం సీతారాములు  మాట్లాడుతూ.. లక్ష్మయ్య 30 సంవత్సరాలు అటెండర్ గా విధులు నిర్వర్తించారని  పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య గతంలో తక్కువగా ఉండేదని విద్యార్థులకు లక్ష్మయ్య సైతం  పాఠాలు  బోధించేవారు అని గుర్తు చేశారు. పాఠశాలకు లక్ష్మయ్య చేసిన సేవలను కొనియాడరు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  హెడ్మాస్టర్ కే. పార్వతమ్మ, గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, వార్డ్ మెంబర్ గాయత్రి, గ్రామస్తులు ఇల్లందుల అప్పారావు, బొబ్బిలి సమ్మయ్య, బత్తిని సాయన్న, గడ్డం లాలయ్య, గడ్డం వీరన్న, తవిడిశెట్టి రాంబాబు, వాంకుడోత్ జగన్, గుండెబోయిన లక్ష్మీనారాయణ, వెలిశాల రవి, నవ చైతన్య యువజన నాయకులు ఆజాద్ కుటుంబ సభ్యులు గామలపాటి నవీన్, గామలపాటి నరేష్, గామలపాటి నగేష్, గామాలపాటి లక్ష్మీనారాయణ, గామాలపాటి సురేష్, నడిగొట్టు నరేష్ పాఠశాల సిబ్బంది,  విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు