భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం.

భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం.

గుండాల మండలం ఆగస్టు 13 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:


గుండాల మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి గడ్డం వరుణ్ అరుణ పథకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్, 
ఇంకా ఎందరో వీరుల ఆశయ సాధన కోసం బదృద్దీన్, ప్రేమ్ నారాయణ భార్గవ్ ల నాయకత్వాన 1936 ఆగస్టు12న ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించింది అని అన్నారు.
బ్రిటీష్ సామ్రాజ్యవాదుల బానిసచేర నుంచి మాతృభూమి విముక్తి కోసం సాగిన వీరోచిత స్వాతంత్ర్య ఉద్యమంలో పొత్తిళ్లలోనే పిడికిళ్లు బిగించి స్వాతంత్ర్యము మా జన్మహక్కు అని మమ్మల్ని అంతం చూసిన - స్వాతంత్ర్యోద్యమ పంతం వీడం అంటూ నినదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని, భరతమాత బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థుల విప్లవ కిషోరులను బలిదానం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన దేశములోనే ఏకైక విద్యార్ధి సంఘం ఏఐఎస్ఎఫ్ అని పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్ర్యనంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణకై, శాస్త్రీయ విద్య, కామన్ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ 90 సంవత్సరాలుగా విద్యార్ధుల శ్రేయస్సు కోసం అశేష త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు గల్లి నుండి డిల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా - పోరాటాలే ప్రాణంగా - విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చదువుతూ పోరాడుతాం - చదువుకై పోరాడుతాం అంటూ తెలంగాణ రైతాంగ పోరాటంలో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వీరోచిత పోరాటం, 18 సంవత్సరములకు ఓటుహక్కు ఉద్యమం, మలిదశ తెలంగాణ పోరాటంలో, హాస్టళ్ల సమస్యలపై, విద్య వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులపై అలుపెరుగని సమరశీల పోరాటాలు చేసి దేశంలో ఎన్నో
విజయాలు సాధించిన చరిత్ర  ఏఐఎస్ఎఫ్ ది అని అన్నారు. శాస్త్రీయ సోషలిజం తన గమ్యంగా, ప్రభుత్వ విద్యను, సెక్యులరిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం తన కర్తవ్యమని, సమరశీల విద్యార్థి ఉద్యమాల నిర్మాణంలో నిమగ్నమైన అఖిల భారత విద్యార్థి సమాఖ్య  90 వసంతాలు పూర్తిచేసుకుని 91వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విద్యార్థుల సమరసిల పోరాటాల కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాసిర్, యశ్వంత్, షబ్బీర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు