సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్లకు MPJ సంఘీభావం

స్వతంత్ర భారత్ కొత్తగూడెం 04-07-2026

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారుల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CMOAI) – సింగరేణి విభాగం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కొనసాగుతున్న నిరాహార దీక్షా శిబిరాన్ని MPJ కొత్తగూడెం యూనిట్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ మన్నన్ సందర్శించి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారుల న్యాయమైన డిమాండ్లకు MPJ పూర్తి మద్దతు ఉంటుందని, సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

CMOAI నాయకులు మాట్లాడుతూ, కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) అధికారులకు అమలు చేసిన Pay Upgradation ను సింగరేణి (SCCL) అధికారులకు కూడా అమలు చేయాలని, 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన PRP బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పారదర్శకమైన పదోన్నతులు, బదిలీల విధానాన్ని అమలు చేయాలని, సంస్థ భవిష్యత్ అభివృద్ధి కోసం కొత్త బొగ్గు బ్లాకులను కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ నిరాహార దీక్షలో ఎం.డి. మతీన్ (సీనియర్ PO), గుగులోత్ అనిల్ (అండర్ మేనేజర్), అజయ్ (అండర్ మేనేజర్), అనుపమ (సీనియర్ అండర్ మేనేజర్), రమ్యశ్రీ (సీనియర్ అండర్ మేనేజర్) తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు