ఎస్ఐఆర్ ను బాధ్యతగా నిర్వహించండి

ఎస్ఐఆర్ ను బాధ్యతగా నిర్వహించండి

గుండాల మండలం జులై 17 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని బాద్యతాయితంగా నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టి పినపాక నియోజక వర్గ ఇన్చార్జి దిండిగల రాజెం దర్ బిఎల్బలకు సూచించారు. గురువారం విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ప్రజలవద్దకు వెల్లి ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని ప్రతి ఓటరు ఓటు పోకుండా జాగ్రతగా వారియొక్క ఫారాలను బిఎల్ఒలకు అందచేయాలని సూచించారు. ఓటర్లకు ఏదైనా సందేహాలు ఉంటే వాటిని వివరించాలని కోరారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుష పాలన సాగిస్తుందని అన్నారు. ప్రశ్నించే కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని, అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు తెల్లం భాస్కర్, మొకాళ్ళ వీరస్వామి, గడ్డం వీరన్న, రమేష్, సుదాకర్, నాగేశ్వరావు, జాడి ప్రభాకర్, కుమార్, నరేష్, సతీష్, అజ్జు, సతీష్, ప్రమోద్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు