సమాధానాలు చెప్పలేకనే అక్రమ అరెస్టులు: పగడాల సతీష్‌రెడ్డి

 సీతారామ ప్రాజెక్టుపై మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే బీఆర్‌ఎస్ నాయకులను , కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేశారని బీఆర్‌ఎస్ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన పినపాక మండల కేంద్రంలో మాట్లాడుతూ అశ్వాపురంలో రాష్ట్ర మంత్రుల పర్యటన సందర్భంగా ఏడూళ్లబయ్యారం పోలీసులు పార్టీ నాయకులను అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన ఖండించారు. మారేళ్లపాడు ద్వారా పినపాక నియోజకవర్గానికి సాగునీరు అందించాలన్నారు. అలాగే రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పినపాక మాజీ శాసనసభ్యులు  రేగా కాంతారావు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుమ్మడి గాంధీ, పీఏసీఎస్ అధ్యక్షుడు రవివర్మ, దాట్ల వాసుబాబు, పోలిశెట్టి సత్తిబాబు, కాయం శేఖర్, మొగిలిపల్లి నరసింహారావు, బుల్లిబాబు, సర్వేశ్వరరావు, వై. చెన్నకేశవులు, జాంఘీర్, బూర రమేష్, ముక్కు వెంకటేశ్వరరెడ్డి, దాసరి రవి, కాళ్ల చంటి, అశోక్, శ్రీను, మునిగెల సంతోష్, ముక్కు నాసర్‌రెడ్డి, రామారావు, జంపయ్య, బూర సురేష్, వీర్రాజ, నరేష్, మురళి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు