ఆదివాసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు
గుండాల మండలం జులై 16 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:
గుండాల మండలం చిన్న వెంకటాపురం మల్లెల గుంపులో ప్రభుత్వ పాఠశాలకు ఇప్పటివరకు శాశ్వత భవనం లేకపోవడం తీవ్ర ఆందోళనకరమని పీడీఎస్‌యూ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు బృందం పాఠశాలను సందర్శించారు, నాయకులు మాట్లాడుతూ
పాఠశాల భవనం లేకపోవడంతో గ్రామస్తులే తమ సొంత ఖర్చులతో తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేసి,పట్టాలు కప్పి,దానిలో విద్యార్థులకు బోధన కొనసాగేలా చేస్తున్నారని,
విద్యార్థులు కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలం మరియు ఎండాకాలంలో విద్యాభ్యాసం మరింత కష్టతరంగా మారుతోందని వారు తెలిపారు. ప్రభుత్వాలు విద్యాభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉందన్నారు.పూర్తి ఆదివాసీ మారుమూల ప్రాంతమైన మల్లెలంగుంపు,ఆదివాసీ విద్యార్థులు విద్య దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
పాలక ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు మల్లెలంగుంపు పక్క భవన నిర్మాణం పట్ల నిర్లక్ష్యం విడాలని,
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చిన్న వెంకటాపురం మల్లెల గుంపులో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, శాశ్వత భవనం నిర్మాణం చేపట్టాలని పీడీఎస్‌యూ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. . విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు నాయకులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు