ఏజెన్సీ ప్రజలకు అందని వైద్యం.

ఏజెన్సీ ప్రజలకు అందని వైద్యం.

•ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం.

•గుండాలలో  30 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలి.

•సిపిఎం జిల్లా కార్యదర్శి 
మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్.

•ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సిపిఎం బృందం.

•ముగ్గురు మంత్రులున్నా ప్రభుత్వ ఆసుపత్రులను, హాస్టళ్లను పట్టించుకోవడం లేదు.


గుండాల మండలం జులై 16 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:

గుండాల మండల కేంద్రంలో 30పడకల ఆసుపత్రి మంజూరు చేసి మారుమూల ఏజెన్సీ ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం నాడు సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, మండల నాయకులు తోలెం గోపి,ఉకే వెంకటేశ్వర్లు,దుగ్గి రామ్మూర్తి, వాగబోయిన పోతయ్య,జోగి రాజేష్ లు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు.ఆసుపత్రికి వచ్చిన రోగులు సిపిఎం జిల్లా కార్యదర్శికి తమ సమస్యల గురించి తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమస్యలకు నిలయంగా ఉందన్నారు.మహిళా డాక్టర్లు,మందులు లేవని ,పార్మాసిస్టు పోస్టు ఖాళీగా ఉందని అన్నారు.దీంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన గుండాల మండల ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు.ఇప్పటికైనా జిల్లా మంత్రులు స్పందించి 30 పడకల ఆసుపత్రి మంజూరు చేసి  ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు.ప్రభుత్వం పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ ఆద్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, మండల నాయకులు తోలెం గోపి,ఊకే వెంకటేశ్వర్లు,దుగ్గి రామ్మూర్తి, వాగబోయిన పోతయ్య, జోగ రాజేష్,కల్తీ శేఖర్, కిట్టు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు