పినపాకలో మూడు రోజుల సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ ప్రారంభం: ఎంఈఓ నాగయ్య

పినపాకలో మూడు రోజుల సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ ప్రారంభం: ఎంఈఓ నాగయ్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో తొలి విడత మూడు రోజుల ఇంటిగ్రేటెడ్ ఇన్‌సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మంగళవారం ప్రారంభమైంది. జూలై 21 నుంచి 23 వరకు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి కొమరం నాగయ్య, జెడ్పీహెచ్‌ఎస్ పినపాక ప్రధానోపాధ్యాయుడు రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ నాగయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మరింత మెరుగుపరచడం, నూతన విద్యా విధానాలపై అవగాహన కల్పించడం, విద్యార్థుల అభ్యాస ఫలితాలను పెంపొందించడం లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు వివిధ విద్యా అంశాలు, బోధనా పద్ధతులు, తరగతి గది నిర్వహణ, విద్యార్థి కేంద్రిత అభ్యాసం వంటి అంశాలపై నిపుణులు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్స్ , సీఆర్‌పీలు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు