ప్రపంచ ఆదివాసి దినోత్సవ నిర్వహణపై కరకగూడెం జేఏసీ అత్యవసర సమావేశం

ప్రపంచ ఆదివాసి దినోత్సవ నిర్వహణపై కరకగూడెం జేఏసీ అత్యవసర సమావేశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం జేఏసీ మండల కమిటీ ఆధ్వర్యంలో రాళ్లవాగు వద్ద ఉన్న పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో  అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆగస్టు 9న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో  చర్చించారు. జేఏసీ మండల కమిటీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ, మండల కన్వీనర్ సోలం రామారావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి కరకగూడెం మండల సర్పంచులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు, ఆధార్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు తోలేం రమేష్, మండలంలోని వివిధ ఆదివాసి సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ని నిర్వహణపై చర్చించారు. ఈ  సమావేశంలో సర్పంచులు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ మండలంలోని అన్ని ఆదివాసి సంఘాలు ఐక్యంగా పనిచేసి దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఆధార్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు తోలేం రమేష్ మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనాల కంటే ఆదివాసి సమాజ సంక్షేమం, అభివృద్ధికే ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి సంఘం సమాజ హితం కోసం కలిసి పనిచేయాలన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో జేఏసీ మండల కమిటీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ, మండల కన్వీనర్ సోలం రామారావు, కరకగూడెం మండల సర్పంచులు, గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు, ఆధార్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు తోలేం రమేష్, వివిధ ఆదివాసి సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు