వెంటనే పీఎం ఫసల్ బీమా యోజన అమలు చేయాలి: బీజేపీ కిసాన్ మోర్చా

 వెంటనే పీఎం ఫసల్ బీమా యోజన అమలు చేయాలి: బీజేపీ కిసాన్ మోర్చా
నాగర్‌కర్నూల్: తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాగర్‌కర్నూల్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ అరుణ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతున్నా తెలంగాణలో అమలు కాకపోవడంతో రైతులు నష్టపోతున్నారని నాయకులు పేర్కొన్నారు. ఖరీఫ్, రబీ పంటలకు బీమా వర్తింపజేయడంతో పాటు కౌలు రైతులను కూడా చేర్చాలని, నమోదు ప్రక్రియను సులభతరం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్ రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు