కొత్త లింగాల, జూలై 20 (ఎస్‌బీ న్యూస్): కొత్త లింగాలలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో కారేపల్లి మండలం గేట్ కారేపల్లి గ్రామానికి చెందిన చెరుకూరి కోటేశ్వరరావు–ఉమారాణి దంపతుల కుమార్తె సంధ్యారాణి ఓనిలా అలంకరణ, కుమారుడు పార్ధు పంచకట్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాస్, మాజీ సొసైటీ చైర్మన్ తోటకూరి శ్రీను, దారావత్ పాండ్య నాయక్, అజ్మిర వీరన్న, వాంకుడోత్ నరేష్ తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు