నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని న్యూ మాస్టర్ మైండ్స్ (గతంలో త్రివేణి) జూనియర్ కళాశాలపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ నోడల్ అధికారి జి. వెంకటరమణ శనివారం కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే పుస్తకాల నిల్వ గదిని సీజ్ చేసి, సంబంధిత యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యాన్ని నోడల్ అధికారి హెచ్చరించారు. తనిఖీల్లో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు