గుండెపోటుతో మృతిచెందిన యువకుడి కుటుంబానికి అండగా 'మేము సైతం' ట్రస్ట్

గుండెపోటుతో మృతిచెందిన యువకుడి కుటుంబానికి అండగా 'మేము సైతం' ట్రస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తోగూడెం గ్రామానికి చెందిన మడకం సాయి (28) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. ఈ సంఘటనతొ ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన సాయి మృతితో అంత్యక్రియలు నిర్వహించడమే భారంగా మారింది.ఈ విషయం తెలుసుకున్న మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ మానవత్వాన్ని చాటుకుంది. ట్రస్ట్ వ్యవస్థాపకులు పసునూరి భాస్కర్ సారథ్యంలో సాయి కుటుంబానికి దహన సంస్కారాల నిర్వహణ కోసం రూ.3,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు . కష్టకాలంలో అండగా నిలిచిన ట్రస్ట్ సభ్యుల సేవలను గ్రామస్థులు అభినందించారు. చిన్న సహాయమే అయినా ఆపదలో ఉన్న కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చిందని స్థానికులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి రంగా శ్రీనివాసరావు, అంబులెన్స్ డ్రైవర్ ప్రదీప్, ట్రస్ట్ సభ్యులు పి. జగన్ మోహన్, చిందుకూరి రామారావు, గ్రామ సర్పంచ్ కృష్ణ, ఉపసర్పంచ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు