పినపాక: గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నర్సరీల్లో పెంచిన పండ్ల, పూల మొక్కలను ఈ నెలలో ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్లు భూపాలపట్నం సర్పంచ్ స్వప్న తెలిపారు.
శుక్రవారం పినపాక మండలం తోగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ నర్సరీని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్, ఎంపీడీవో ఆదేశాల మేరకు నర్సరీలో వివిధ రకాల పండ్ల, పూల మొక్కలను పెంచుతున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రతి ఇంటి పరిసరాలు పచ్చదనంతో కళకళలాడేలా ఈ నెలలో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజలు మొక్కలను నాటి సంరక్షించాలని ఆమె కోరారు.
0 కామెంట్‌లు