జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా బందగిరినగరం గ్రామంలోని పల్స్ పోలియో కేంద్రాన్ని ఉప సర్పంచ్ ధనలక్ష్మి సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలియో వ్యాధి నిర్మూలనకు ప్రతి ఐదు సంవత్సరాల లోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని కోరారు.
పోలియో చుక్కల ప్రాముఖ్యతపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తూ, ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా అందరూ బాధ్యతగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు