పినపాక పీహెచ్‌సీ పరిధిలో పల్స్ పోలియో కేంద్రాలను పరిశీలించిన డాక్టర్ అనిల్ కుమార్
పినపాక:జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలను పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కేంద్రాల్లో ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయిస్తున్న తీరును పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా ప్రతి ఇంటికి చేరుకుని అవగాహన కల్పించాలని, అర్హులైన చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.
కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు