ఆప్త మిత్రుల అపూర్వ కలయిక

ఆప్త మిత్రుల అపూర్వ కలయిక

గుండాల మండలం జూన్ 29 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

గుండాల మండల కేంద్రానికి చెందిన ఆప్త మిత్రులు ఆదివారం సాయనపల్లి సమీపంలోని కిన్నెరసాని ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని ఆప్యాయ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. విద్యార్థి దశలోని అనుభవాలు, ఉపాధ్యాయుల సేవలు, పాఠశాల రోజుల విశేషాలను స్మరించుకుంటూ పరస్పరం ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తమ మిత్ర బృందానికి చెందిన ఇద్దరు సర్పంచులు, వార్డు మెంబర్ను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, ఇలాంటి ఆత్మీయ కలయికలను ప్రతి సంవత్సరం నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం అందరూ కలిసి భోజన కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా గడిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు