భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీలో సంత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ మాట్లాడుతూ
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంత ప్రాంగణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ, సంతను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే గ్రామ ప్రజలు, వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూరనుందన్నారు. ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు కోలపిన్ని మానస, మాదాడి రాజేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏఎం చారీ, ఎండి యాకూబ్ అలీ,తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు