బాల్యమిత్రుడి పదవీ విరమణ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
అమ్రాబాద్, జూన్ 30:అమ్రాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు ఇమ్మడి విజయమోహన్ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చిన్ననాటి స్నేహితుడైన విజయమోహన్ ఉపాధ్యాయ వృత్తిని సేవాభావంతో నిర్వహించి, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ఆదర్శ ఉపాధ్యాయుడిగా నిలిచారని కొనియాడారు. విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చేందుకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
పదవీ విరమణ అనంతరం విజయమోహన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు పేద విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
నల్లమల్ల ప్రాంతంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించి ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
అనంతరం పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు ఇమ్మడి విజయమోహన్‌ను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంఈవో, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
#Achampet #Amrabad #MLAVamsiKrishna #TeacherRetirement #RetirementCeremony #Education #GovernmentSchool #Teacher #Guru #Telangana #RevanthReddy #Congress #PublicService #RespectTeachers #InspiringTeachers #TeluguNews #SBNews #EducationMatters #SchoolLife #TeacherHonor
0 కామెంట్‌లు