మణుగూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దొబ్బల వెంకటప్పయ్య

మణుగూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దొబ్బల వెంకటప్పయ్య
మణుగూరు, జూలై 1: మణుగూరులోని లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షుడిగా దొబ్బల వెంకటప్పయ్య, కార్యదర్శిగా కత్తి రామ్ చందర్, కోశాధికారిగా మేదరమెట్ల గిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు దొబ్బల వెంకటప్పయ్య మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

నూతన కార్యవర్గ సభ్యులను పలువురు క్లబ్ సభ్యులు, సామాజిక ప్రముఖులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు