అశ్వాపురం మండలంలోని మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పనుల జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుత్తేదారులు, జలవనరుల శాఖ అధికారులు మరియు మెగా కంపెనీ ప్రతినిధులపై మండిపడుతూ, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎలాంటి సాకులు చెప్పకుండా ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టు ద్వారా రైతులకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి కాకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
#మారెళ్లపాడు_ఎత్తిపోతల_పథకం #అశ్వాపురం #తుమ్మలనాగేశ్వరరావు #జలవనరులశాఖ #తెలంగాణ #రైతులకునీరు #SBNews
0 కామెంట్‌లు