స్మారక స్థూపం ఆవిష్కరించిన పోతినేని సుదర్శన్
పతాక ఆవిష్కరణ చేసిన మల్లు లక్ష్మి
పాల్గొన్న నున్నా నాగేశ్వరరావు, బండి రమేష్, అన్నవరపు కనకయ్యలు.
పాల్గొన్న వందలాది మంది ప్రజలు
*గుండాల మండలం జూన్ 2 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*
రగిలే విప్లవ జ్వాల, ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన జోగ నర్సయ్య కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, మల్లు లక్ష్మి, నున్నా నాగేశ్వరరావులు ఘన నివాళి అర్పించారు. సోమవారం నాడు తూరుబాక గ్రామంలో అమరజీవి జోగ నర్సయ్య ఐదవ వర్ధంతి సందర్భంగా స్మారక స్థూపావిష్కరణ కార్యక్రమం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. జోగ నర్సయ్య స్మారక స్థూపాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ఆవిష్కరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి సిపిఎం జెండా ఆవిష్కరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, బండి రమేష్ లు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా తోలెం గోపి అద్యక్షతన జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ జోగ సర్సయ్య చిన్ననాటి నుంచే విప్లవ భావాలు పుణికి పుచ్చుకుని చివరి శ్వాస వరకు ఎర్రజెండా వదలని గొప్ప నాయకుడన్నారు. ఆయన మరణం పార్టీకి, వారి కుటుంబానికి తీరని లోటన్నారు. మార్క్సిజం, లెనినిజం ఆశయాల సాధనకు జీవితాంతం కృషి చేసిన మహానాయకుడన్నారు. గుండాల మండలంలో ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి ప్రజలందరి మన్ననలు పొందారన్నారని కొనియాడారు. ఆదివాసీ విద్యార్థులకు సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్ కోసం, ఓపెన్ కాస్టును వ్యతిరేకిస్తు, పోడు భూముల పట్టాల కోసం, ప్రజల సమస్యలపై అఖిలపక్ష పార్టీలతో కలిసి అనేక పోరాటాలు చేశాడన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి మాట్లాడుతూ జోగ నర్సయ్య పోరాటాలు, త్యాగం స్మారక స్థూపంలో చూసుకుని నర్సన్నను స్మరించుకుందామని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేదప్రజల సమస్యలు ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుందని, సిపిఎం ప్రజా పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ గుండాల మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. గుండాల మండలంలో మొక్కజొన్న రైతులు గోప పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలులో వైఫల్యం చెందాయని విమర్శించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, బండి రమేష్ లు మాట్లాడుతూ మండలంలో సిపిఎం బలోపేతం కోసం పోరాడటమే జోగ నర్సయ్యకిచ్చే ఘన నివాళి అన్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సిపిఎం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు బి.మదు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, మండల నాయకులు తోలెం గోపి, భూపాల్, ఊరికే వెంకటేశ్వర్లు ప్రసంగించారు. అదేవిదంగా బిఆర్ఎస్ మండల కార్యదర్శి గడ్డం వీరన్న, మాస్ లైన్ మండల నాయకులు పూనెం మంగయ్య, తుడుందెబ్బ నాయకులు కొడెం వెంకటేశ్వర్లు, పూనెం శ్రీనివాస్, న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కోరం సీతారాములు, గడ్డం లాలయ్య, ముత్తాపురం సర్పంచ్ కల్తీ రాధ, ఈసం పాపారావు లు పూలు వేసి నివాళు లర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలగాని బ్రహ్మాచారి, అన్నవరపు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఎస్ ఏ నబి, నిమ్మల వెంకన్న, కొండబోయిన వెంకటేశ్వర్లు, యాసా నరేష్, సత్రపల్లి సాంబశివరావు, గద్దల శ్రీనివాస్, బత్తుల వెంకటేశ్వర్లు, గోవర్ధన్, కొమరం కాంతారావు, శంకరన్న, నాగన్న, సాగరన్న, ఊకే వెంకటేశ్వర్లు, తోలెం గోపి, భూపాల్, పాయం సారమ్మ, వజ్జ సుశీల, సుల్తానా, బొమ్మల కనకరాజు, దుగ్గి రామ్మూర్తి, జోగ రాజేష్, కల్తీ శేఖర్, కల్తీ సమ్మయ్య, వాగబోయిన నర్సింహారావు, ఎరెం రామకృష్ణ, గడ్డం క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు