*గుండాల మండలం జూన్ 2 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*
మారుమూల గిరిజన ప్రాంతమైన గుండాల మండలంలో తహశీల్దార్గా విధులు నిర్వహించి ఇటీవల బదిలీపై వెళ్లిన ఖాసీం అందించిన సేవలు మండల ప్రజల మన్ననలు పొందుతున్నాయి. ఆయన గుండాల మండలంలో పనిచేసిన పదవీకాలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రభు త్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.ముఖ్యంగా గిరిజన గ్రామాల అభివృద్ధి, భూ సంబంధిత సమస్యల పరిష్కారం, రెవెన్యూ సేవల వేగ వంతమైన అందజేతలో తహసీల్దార్ ఖాసీం విశేష కృషి చేశారు. మండలంలోని ప్రజలతో సత్సంబంధాలు కొన సాగిస్తూ, వారి సమస్యలను ఓర్పుతో విని పరిష్కరించేం దుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారు. అధికారిగా మాత్రమే కాకుండా ప్రజలకు చేరువైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఖాసీం, తన విధుల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన బదిలీ నేపథ్యంలో మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఆయన సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గుండాల మండల అభివృద్ధికి తహశీల్దార్ ఖాసీం చేసిన సేవలు చిరస్మరణీ యమని పలువురు అభిప్రాయపడ్డారు.
0 కామెంట్‌లు