భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన దంపతులు ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన సిద్దిపేట ప్రాంతంలో చోటుచేసుకుంది. మణుగూరులో రవి గ్రాఫిక్స్ నిర్వహిస్తున్న రవి, ఆయన భార్య సునీత ప్రయాణిస్తున్న కారు ముందున్న ఇసుక లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో రవి, సునీత అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. కారులో ఉన్న వారి కుమారుడు, కోడలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మణుగూరులో సుపరిచితులైన రవి, సునీత మృతి వార్త తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషాద ఘటనతో మణుగూరు ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన కుమారుడు, కోడలు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మృతుల కుటుంబానికి పలువురు ప్రముఖులు, స్థానికులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
0 కామెంట్‌లు