మణుగూరులో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు: మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలను మణుగూరు మున్సిపాలిటీలో మెప్మా మహిళలకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళల సంక్షేమం, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పేద, మధ్యతరగతి మహిళలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం నిరంతరం అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళలకు గౌరవం కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ ప్రసాద్, రెవెన్యూ శాఖ డిప్యూటీ తహసీల్దార్ రామారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మెప్మా మహిళలు పాల్గొన్నారు. మహిళలు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
#Manuguru #IndirammaCheeralu #MEPMA #PayamVenkateswarlu #WomenEmpowerment #ManuguruMunicipality #BhadradriKothagudem #TelanganaNews
0 కామెంట్‌లు