జల్..! జంగిల్..! జమీన్..! హక్కుల కోసం ఆదివాసుల పోరాటం

జల్..! జంగిల్..! జమీన్..! హక్కుల కోసం ఆదివాసుల పోరాటం
-జూన్ 3న పాకాల కొత్తగూడలో "ఆదివాసి పోరు కేక" బహిరంగ సభ విజయవంతం చేయాలి : అలెం కోటి
పినపాక, జూన్ 1: ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేస్తూ జూన్ 3న పాకాల కొత్తగూడలో నిర్వహించనున్న "ఆదివాసి పోరు కేక" బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర ఉపాధ్యక్షులు అలెం కోటి పిలుపునిచ్చారు.

సోమవారం మణుగూరులో ఆయన మాట్లాడుతూ, ఆదివాసుల సంప్రదాయ హక్కులు, అటవీ భూముల పరిరక్షణ, స్వయం ప్రతిపత్తి సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో ప్రతి ఆదివాసి భాగస్వామి కావాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడం కోసం ఐక్యంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

జల్, జంగిల్, జమీన్ అనే నినాదంతో ఆదివాసి సమాజం తమ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం ఉద్యమిస్తోందని, పాకాల కొత్తగూడలో నిర్వహించనున్న సభ ఈ ఉద్యమానికి మరింత బలం చేకూర్చుతుందని అన్నారు. ఈ బహిరంగ సభకు ఆదివాసి సంఘాల నాయకులు, యువత, మహిళలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

సభ నిర్వహణకు సహకరిస్తున్న అన్ని సంఘాలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఉద్యమ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసుల హక్కుల సాధన కోసం చేపడుతున్న ఈ పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

#ఆదివాసిపోరుకేక #జల్జంగిల్జమీన్ #పాకాలకొత్తగూడ #ఆదివాసిహక్కులు #తుడుందెబ్బ #పినపాక

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు