త్రినిషా పుట్టినరోజు సందర్భంగా వందరోజుల కార్మికులకు నిమ్మరసం, మజ్జిగ పంపిణీ

త్రినిషా పుట్టినరోజు సందర్భంగా వందరోజుల కార్మికులకు నిమ్మరసం, మజ్జిగ పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ-బయ్యారం గ్రామానికి చెందిన భోగబోయిన సతీష్ కుమార్తె త్రినిషా పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. మహర్షి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు తోలం శ్రీను సహకారంతో గ్రామంలో వందరోజుల ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కార్మికులకు నిమ్మరసం, మజ్జిగ పంపిణీ చేశారు.

ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కార్మికులకు దాహార్తి తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా త్రినిషాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.

#త్రినిషాపుట్టినరోజు #సేవాకార్యక్రమం #ఈబయ్యారం #పినపాక #మహర్షిస్వచ్ఛందసంస్థ #తోలంశ్రీను #ఉపాధిహామీకార్మికులు #BhadradriKothagudem #PinapakaNews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు