ఐదు సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డా. వేణు సూచించారు. పినపాక మండలం జానంపేటలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఉమామహేశ్వరి, ఉప సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షులు రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, పోలియో నిర్మూలనకు ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు