కొనుగోలు చేసిన మొక్కజొన్నలను వెంటనే గోదాములకు తరలించాలి. ఇల్లందు --- గుండాల ప్రధాన రహదారిపై న్యూ డెమోక్రసీ--- అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో.

కొనుగోలు చేసిన మొక్కజొన్నలను వెంటనే గోదాములకు తరలించాలి

ఇల్లందు --- గుండాల ప్రధాన రహదారిపై న్యూ డెమోక్రసీ--- అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో


*గుండాల మండలం మే 20 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్నలను వెంటనే గోదాములకు తరలించాలని సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ -అఖిలభారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో (పిఎసిఎస్) కార్యాలయం వద్ద) ఇల్లందు-- గుండాల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు ఆందోళన విరమించేది లేదని గుండాల - ఇల్లందు ప్రధాన రహదారిపై భీస్మించుకొని ఆందోళనకార్లు కూర్చున్నారు. ఆందోళన దగ్గరకు మండల తహసిల్దార్ కాశిం, గుండాల ఎస్సై రాహుఫ్ చేరుకొని పై అధికారులతో మాట్లాడి రేపటి నుండి మొక్కజొన్న ధాన్యాన్ని గోదాములకు తరలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా నాయకులు గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు, బచ్చల సారయ్యలు మాట్లాడుతూ గత నెలరోజుల నుండి మొక్కజొన్నలు కొనుగోలు ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు లారీల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసి గోదాములకు తరలించలేరని, సొసైటీ ప్రాంగణంలో ఉన్న మొక్కజొన్నలు వర్షం కు తడిసి మొలకలు ఎత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన మొక్కజొన్న ధాన్యాన్నికి ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో డబ్బులు వేయలేదని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నప్పటికీ రైతులకు చేసిన మేలు ఏమి లేదని అన్నారు. అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం మొక్కజొన్న ధాన్యాని గోదాములకు తరలించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్ న్యూడెమోక్రసీ--అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నాయకులు గడ్డం లాలయ్య, పర్శక రవి, యాసారపు వెంకన్న, అరేం నరష్, ఈసం కృష్ణ, మానాల ఉపేందర్, పెండకట్ల పెంటన్న, భూఖ్య వెంకన్న, పునెం నరసన్న, పాయం ఎల్లన్న, గోగ్గేల శ్రీను,కల్తీ నరసింహారావు, తాటి రమేష్,అరెం రామారావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు