కరకగూడెం మండలంలోని కలవల నాగారం ఫారెస్ట్ బీట్ పరిధిలో పోడు సాగు చేస్తున్న గిరిజన రైతులకు పెండింగ్‌లో ఉన్న హక్కు పత్రాలను తక్షణమే అందించాలని సీపీఎం మండల కన్వీనర్ కొమరం కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో కోర్టు స్టే కారణంగా హక్కు పత్రాల పంపిణీ ఆగిపోయిందని, ఇప్పటికే సర్వేలు పూర్తయ్యాయని తెలిపారు. రైతులు రైతు భరోసా, రుణాలు, ఎరువుల వంటి ప్రభుత్వ పథకాల నుంచి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి గిరిజన పోడు సాగుదారులకు న్యాయం చేయాలని కోరారు.
0 కామెంట్‌లు