జిల్లాలో పినపాకలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

జిల్లాలో పినపాకలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పినపాక మండలంలో ఆదివారం 44 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రత పినపాకలో నమోదు కాగా, మణుగూరు ప్రాంతంలోనూ తీవ్ర వేడి ప్రభావం కనిపించింది. మధ్యాహ్న సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

#Pinapaka #Manuguru #HeatWave #BhadradriKothagudem #TelanganaWeather #SummerHeat #SBNews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు