మొండికుంటలో ఉపాధి హామీ పనుల పరిశీలన
అశ్వాపురం మండలం మొండికుంట గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ ముత్యాలరావు పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యతపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధికి దోహదపడే పనులు చేపట్టాలని సూచించారు. పనులు సమయానికి పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మర్రి సంధ్య, గ్రామ కార్యదర్శి సంధ్య మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
#Ashwapuram #MGNREGS #VillageDevelopment #RuralDevelopment #Pinapaka #TelanganaNews #GramPanchayat #EmploymentGuarantee #LocalNews #TeluguNews #sbnews
0 కామెంట్‌లు