ఆదోని పట్టణంలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్ రూఫ్‌లు ఏర్పాటు చేయాలని SFI ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా ఉపాధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు సంజయ్, కార్యదర్శి శశిధర్, DYFI పట్టణ అధ్యక్షుడు మోహన్ పాల్గొన్నారు.
ఇటీవల భారీ ఎండల కారణంగా రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ఎండదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూల్ నగరంలో అమలు చేసిన విధంగా ఆదోనిలో కూడా గ్రీన్ మ్యాట్ రూఫ్‌లను ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే, బస్టాప్‌లు మరియు రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు, ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
#ఆదోని #SFI #ఎండ తీవ్రత #ప్రజల సమస్యలు #చలివేంద్రాలు
0 కామెంట్‌లు