తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు అవుతున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో రీసెర్చ్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కళాశాల రీసెర్చ్ కమిటీ ఆధ్వర్యంలో “రీసెర్చ్ మెథడాలజీ – రీసెర్చ్ మేడ్ సింపుల్ – ఐడియా టు ప్రాజెక్ట్” అనే అంశంపై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే. జాన్ మిల్టన్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో ప్రపంచ అభివృద్ధి మొత్తం పరిశోధనలపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేసుకొని, పరిశోధనల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. శ్రీను, రీసెర్చ్ కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ వి. రాఘసుమ, అకాడమిక్ కోఆర్డినేటర్లు హిమజ, భాగ్య, కోఆర్డినేటర్ డాక్టర్ సమీరా, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ బి. సుధాకర్ రావు పరిశోధన విధానాలు, ప్రాజెక్ట్ తయారీపై వివరంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పరిశోధనపై అవగాహన పెంపొందించడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.
#భద్రాచలం #రీసెర్చ్ #విద్యార్థులు #తెలంగాణ #ప్రజాపాలన
0 కామెంట్‌లు