మణుగూరు ప్రతినిధి:
భద్రతతో ప్రయాణం – సురక్షిత గమ్యం అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మణుగూరు అంబేద్కర్ సెంటర్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికులు, ఉద్యోగులు పాల్గొని ప్రజల్లో చైతన్యం కల్పించారు.
ఈ సందర్భంగా “హెల్మెట్ ధరించండి – ప్రాణాలు కాపాడండి”, “సీటు బెల్ట్ తప్పనిసరి”, “మితి వేగం – సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలంటూ పిలుపునిచ్చారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం లక్ష్యమని పేర్కొన్నారు.
0 కామెంట్‌లు