నీ పిల్లి వల్లే మా పిల్లి తల్లీ అయ్యిందియజమానుల గొడవ. .. పెద్దల సమక్షంలో సెటిల్మెంట్.. చెరి రెండు పిల్లులు పంపిణీ..

బెంగళూరులోని శేషాద్రిపురం జయభీమానగర్‌లో ఓ వింత ఘటన జరిగింది. కేవలం పిల్లి పిల్లల విషయంలో రెండు కుటుంబాలు నడిరోడ్డుపై గొడవకు దిగాయి. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే, ఏకంగా పోలీసులు రంగంలోకి దిగి పంచాయితీ చేయాల్సి వచ్చింది.
జయభీమానగర్‌లో ఇద్దరు వ్యక్తులు ఇరుగుపొరుగున నివసిస్తున్నారు. వీరిలో ఒకరు ఆడపిల్లిని, మరొకరు మగపిల్లిని పెంచుకుంటున్నారు. అయితే, ఆదివారం రోజు ఆ ఆడపిల్లి 4 పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఆడపిల్లి యజమాని ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. పిల్లి పిల్లల గోల భరించలేక, పక్కనే ఉన్న మగపిల్లి యజమానితో గొడవకు దిగాడు. మా పిల్లి పిల్లలు కనడానికి నీ మగ పిల్లే కారణం.. కాబట్టి ఈ పిల్లలను సాకే బాధ్యత నీదే" అంటూ ఆ నాలుగు పిల్లలను తీసుకెళ్లి పొరుగువారి ఇంట్లో వదిలేశాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య రగడ మొదలైంది. గొడవ పెద్దది కావడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. పిల్లి పిల్లల సంరక్షణ విషయంలో ఇరు పక్షాలకు సర్దిచెప్పారు. చివరకు ఆ నాలుగు పిల్లలను చెరి రెండు చొప్పున పంచుకుని పెంచాలని సూచించి, ఈ 'పిల్లి పోరు'కు ముగింపు పలికారు.

#cat #catlovers

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు