కేఎల్ఆర్ కాలేజీ బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని విషయంలో కాలేజీ యాజమాన్యం నమ్మకద్రోహం చేసిందని బాధితురాలి తల్లిదండ్రులు విమల, రవీందర్ ఆరోపించారు. తమ కుమార్తె స్వర్ణంబికకు జరిగిన ప్రమాదం తర్వాత విద్యా, వైద్య బాధ్యతలు మాదేనని చెప్పి మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తమ కుమార్తెకు ఇప్పటికే ఐదుసార్లు శస్త్రచికిత్సలు జరిగాయని, అన్ని వైద్య ఖర్చులను తామే భరించాల్సి వచ్చిందన్నారు. కాలేజీ యాజమాన్యం ఎలాంటి సహాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు.
అలాగే, డిప్లొమా మూడో సంవత్సరం చదువుతున్న తమ కుమార్తె ఆన్లైన్ క్లాసులు పూర్తిచేసుకుని పరీక్షలకు సిద్ధమైనప్పటికీ, పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించలేదని తెలిపారు. ఇది విద్యార్థి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు.
ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తల్లిదండ్రులు తెలిపారు.
Hashtags:
#KLRCollege #StudentIssue #JusticeForStudent #BusAccident #EducationRights #ParentsDemand #LegalAction #TelanganaNews
0 కామెంట్‌లు