గుండాల మండల సీడ్స్, ఫెర్టిలైజర్స్ సంఘానికి నూతన కమిటీ ఎన్నిక

గుండాల మండల సీడ్స్, ఫెర్టిలైజర్స్ సంఘానికి నూతన కమిటీ ఎన్నిక

*గుండాల మండలం ఏప్రిల్ 20 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

గుండాల మండలంలో సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెర్టిసైడ్స్ సంఘానికి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా పట్వారి వెంకన్నను ఎన్నుకోగా, గౌరవ అధ్యక్షుడిగా మానాల వెంకటేశ్వర్లు, అధ్యక్షులుగా తిరుకొల్లూరి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. కార్యదర్శిగా మానాల ప్రభాకర్, కోశాధికారిగా మాడే మంగయ్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా చాట్ల సూర్యనారాయణ, వీరస్వామి, సెక్రటరీగా పి. వేణు, ఈసీ సభ్యులుగా పాయం నాగభూషణం, ఈసం రాజబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, శేషు, సుందర్రావు, లక్ష్మీనారాయణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు