మణుగూరు ప్రతినిధి:
మణుగూరు ప్రాంతంలో 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఘటన చోటుచేసుకుంది. సింగరేణి ఏరియాలోని కొండాపురం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో బొగ్గు లోడింగ్‌కు వెళ్లిన టిప్పర్ మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా దగ్ధమైంది. తీవ్ర ఎండ దాటికి వాహనం మంటలు అంటుకున్నట్లు కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు.
0 కామెంట్‌లు