డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి - డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ.. విద్యార్థులతో ప్రతిజ్ఞ


ఈగల్ ఫోర్స్ డీఎస్పీ పుష్పన్ కుమార్, మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా పినపాక మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సై సురేష్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈగల్ ఫోర్స్ డీఎస్పీ పుష్పన్ కుమార్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి హాజరయ్యారు.
ముందుగా బయ్యారం క్రాస్ రోడ్డునుంచి జివిఆర్ ఫంక్షన్ హాల్ వరకు బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శ్రీవిద్య, రాధిక, ఎక్సలెంట్ పాఠశాలల విద్యార్థులతో కలిసి డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జివిఆర్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు మాట్లాడుతూ మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు చెడు అలవాట్లకు లోనై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పంతో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువకులతో కలిసి డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా ప్రతిజ్ఞ చేయించారు. అలాగే పాల్గొన్న విద్యార్థులకు వాలీబాల్, క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1908కు తెలియజేయాలని, సమాచారం గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ గోపాలకృష్ణ, స్పెషల్ ఆఫీసర్ తాతారావు, సీఐ వెంకటేశ్వరరావు, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ కొమరం నాగయ్య, స్థానిక ఉపసర్పంచ్ గంగిరెడ్డి సందీప్ రెడ్డి, భూపాలపట్నం ఉపసర్పంచ్ శిరీష, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉడుముల లక్ష్మారెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు