ఆదోని పట్టణంలోని వైఎస్సార్ నగర్‌లో 22వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 22వ వార్డు ఇన్‌చార్జ్ టీ. గోవిందరాజులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి, యువ నాయకుడు మనోజ్ రెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ కౌన్సిల్‌ను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే 2029 ఎన్నికల్లో వై. సాయి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి కానుకగా ఇవ్వాలని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు మహాదేవ, రాముడు, గణేష్, సూరి తదితరులు పాల్గొన్నారు.
స్వామి దాసు, రిపోర్టర్
స్వతంత్ర భారత్ టీవీ, ఆదోని
0 కామెంట్‌లు