మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి 


-పినపాక ఎంపీడీవో వెంకటేశ్వరరావు 
 మహిళలు అన్ని రంగాలలో రాణించాలని పినపాక ఎంపీడీవో వెంకటేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపాలపట్నం గ్రామపంచాయతీలో సర్పంచ్ తొలేం స్వప్న ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో రాణించాలని ఆయన కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో మహిళల సేవలు అమోఘమని తెలియజేశారు. మహిళలు వారి హక్కులను వినియోగించుకోవాలని తెలిపారు. ప్రభుత్వాలు 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించడం హర్షనీయమన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ నిట్ట శిరీష, వెంకట్రావుపేట సర్పంచ్ సింధు, వార్డు మెంబర్లు సంధ్యారాణి, బొగ్గం రమణ, నిట్ట సావిత్రి, తులసమ్మ, మహేంద్ర, నరసింహారావు, అంగన్వాడీ టీచర్ సుజాత, ఆశా వర్కర్ నీలమ్మ మొదలైన వారు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు