వీధి కుక్కల ఘటన లు పున రావృతం కాకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని ప్రజలను కాపాడాలని అధికారుల కు బీజేపీ నేతల విజ్ఞప్తి
నాగర్ కర్నూల్, మార్చ్ 08,(ఎస్ బి
న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం లోని జూబ్లీ నగర్ కాలనీ లో ఆదివారం ఉదయం వీధి కుక్కల దాడిలో ఎనిమిదేళ్ల బాలిక తీవ్రంగాగాయపడింది. మున్సిపల్ కార్యాలయానికి (కూత వేటు దూరం) సమీపంలో జూబ్లీ నగర్‌లో నివసిస్తున్న అక్షయ అనే బాలికపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమి బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
పట్టణంలోని పలు కాలనీల్లో వీధి కుక్కలు, కోతుల సమస్య కూడా ఉన్నాయని అవి పెరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్, చైర్మన్ వెంటనే స్పందించి వీధి కుక్కలు, కోతుల సమస్యను నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రాణనష్టం జరగక ముందే అచ్చంపేట పట్టణ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత మున్సిపాలిటీఅధికారుల పై ఉందని వారు పేర్కొన్నారు.
0 కామెంట్‌లు