పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, పినపాక మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆదేశాల మేరకు పినపాక గ్రామపంచాయతీలో బీఆర్‌ఎస్ యూత్ కమిటీని ఏర్పాటు చేశారు. యూత్ అధ్యక్షుడు చెన్నకేశవులు ఆధ్వర్యంలో కమిటీని ప్రకటించారు.
ఈ కమిటీలో పంది సాయిరాం ప్రధాన కార్యదర్శిగా, గోగ్గల సాయి కోశాధికారిగా, సోంపెల్లి సిసింద్రీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుదిగొండ రామకృష్ణ, యూత్ నాయకుడు గణపరపు ప్రవీణ్ (పవన్), డా. సత్యం, తోకల సతీష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు