తండా సమస్యల పరిష్కారం కోరుతూ ఐటిడిఏ పీఓకు వినతి

తండా సమస్యల పరిష్కారం కోరుతూ ఐటిడిఏ పీఓకు వినతి
భద్రాద్రి కొత్తగూడెం: లక్ష్మీదేవిపల్లి మండలం దుధియా తండా గ్రామపంచాయతీ పరిధిలో పలు సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామస్తులు ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్‌కు వినతిపత్రం అందజేశారు. కిన్నెరసాని కాలువ పక్కన రహదారి విస్తరణ, తండా వరకు సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు.
సూర్యతండా, మునియతండాలకు కొత్త రోడ్లు, సూర్యతండా–కరకావాగు మధ్య బ్రిడ్జి నిర్మాణం, దశాబ్దాలుగా సాగుచేస్తున్న భూములకు హక్కు పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ రమేష్, ఉపసర్పంచ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు